top of page

Telugu tanslation of 'On Living and Dying'

 

Jeevinchadamu Maraninchadamu(On Living and Dying)

₹275.00 Regular Price
₹205.00Sale Price
Quantity
  • 1895లో మదనపల్లిలో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తిని మహోన్నతమైన తాత్వికతను బోధించిన ఋషితుల్యునిగా ప్రపంచమంతా పరిగణిస్తున్నది. గురువులా కాకుండా ఒక స్నేహితునిలా అతడు ప్రజల నుద్దేశించి ప్రసంగించే వాడు. విద్యార్థులను, యువతీ యువకులను, పెద్దలను అందరినీ ప్రభావితం చేసిన అతడి ప్రసంగాలు జీవితం ఎడల వారిలో ప్రగాఢ స్పృహను మేల్కొల్పాయి. 1986లో తుదిశ్వాస వదిలేవరకు అవిశ్రాంతంగా పర్యటించి, మానవ చేతనలో సంపూర్ణమైన పరివర్తన కలగడం కొరకు రచనలు, ప్రసంగాలు చేసి, చర్చలు, సంవాదాలు, సంభాషణలు జరిపాడు. జీవితంలోని సౌందర్యాన్ని, సంక్లిష్టతను పరిగ్రాహ్యం చేసుకోగల నవ్యదృష్టిని ప్రసాదించిన దార్శనికుడు.

    మరణాన్ని అర్థం చేసుకోవాలంటే జీవితాన్ని మీరు అర్థం చేసుకొని తీరాలి.

    నేను మరణం గురించి ఎందుకు మాట్లాడానంటే, ఈ విషయం గురించి మీరు పూర్తిగా నిజంగానే అవగాహన చేసుకోవాలని, ఇప్పుడు మాత్రమే కాదు. మీ జీవితం పొడుగునా మరణం గురించి పూర్తి అవగాహనతో ఉండాలని. అలా చేయడం చేత దుఃఖం నుండి విముక్తి, భయం నుండి విముక్తి లభిస్తాయి. చనిపోవడం అంటే ఏమిటో దాని నిజమైన అర్థం మీకు తెలుస్తుంది.

OTHER RECCOMENDATIONS

Related Products

bottom of page