top of page

Telugu translation of 'Freedom From the known'

గతం నుండి విముక్తి

 

ఈ పుస్తకం ఇంగ్లీషు మూలం ఫ్రీడం ఫ్రమ్‌ ద నోన్‌. 1969లో ఫ్రీడం ఫ్రమ్‌ ద నోన్‌ ప్రచురణ జరిగింది. అప్పటి నుండి కృష్ణమూర్తి బోధలకు ప్రాథమిక వాచకంగా ఈ పుస్తకాన్ని పలువురు స్వీకరించడం సమంజసనీయంగా తోస్తుంది. మనిషి స్థితిగతులను గురించి, అంతులేని అతడి సమస్యలను గురించి కృష్ణమూర్తి చెప్పిన వాటి క్రోడీకరణ జరగడంలో ఇదే ప్రథమ ప్రయత్నం. యూరపు, ఇండియాలలో వివిధ వయసులలో వున్న, విభిన్న దేశాలకు చెందిన శ్రోతలకు అతడు ఇచ్చిన వంద కంటె ఎక్కువ ప్రసంగాలలో నుండి తీసుకున్న విషయాలు ఇవి. సన్నిహిత మిత్రురాలు, జీవిత చరిత్రల రచయిత అయిన మేరి లుటియన్స్‌ను కృష్ణమూర్తి స్వయంగా ఈ పుస్తకం తయారు చేయమని అడిగి, పుస్తకం పేరును కూడా సూచించారు. ఇందులో వున్న ప్రతి ఒక్క పదము అతడు చెప్పినదే. ఏ మార్పులూ చేయలేదు. పాఠకుల అవగాహనకు సహాయపడే విధంగా ఆమె వీటిని ఒక క్రమంలో పెట్టి సంపుటీకరించారు.

జె. కృష్ణమూర్తి (1895-1986) మహోన్నతుడైన తత్వవేత్తగా, ధర్మబోధకునిగా విశ్వవిఖ్యాతి గడిరచారు. అరవై సంవత్సరాలుకు పైగా ప్రపంచమంతటా పర్యటించి ప్రసంగాలు ఇచ్చారు. గురువులా కాకుండా ఒక స్నేహితునిలా విభిన్న రకాలకు చెందిన శ్రోతలతో మాట్లాడటం, సంవాద సంభాషణలు జరపడం చేశారు. అతడి బోధలు గ్రంధజ్ఞానం మీద, సిద్ధాంతాల మీద ఆధారపడినవి కాదు. అందుచేత, ప్రస్తుత ప్రపంచ సంక్షోభం గురించి, అంతులేని ఈ మానవ అస్తిత్వపు సమస్యల గురించి అతడు ఇచ్చే సమాధానాలు స్పష్టంగా వుండి సూటిగా తాకుతాయి.

Gatam nundi Vimukti (Freedom From the Known)

₹195.00 Regular Price
₹150.00Sale Price
Quantity

    OTHER RECCOMENDATIONS

    Related Products

    bottom of page